న్యాయ వాదుల హత్యను ఖండించిన కరీంనగర్ బార్ అసోసియేషన్
పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై పట్టపగలు జరిగిన న్యాయవాద దంపతుల హత్యలపై కరీంనగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. కోర్టు విధుల నిమిత్తం హైదరాబాద్ నుండి మంథని కోర్టుకు వచ్చిన న్యాయవాదులు గట్టు వామనరావ్, నాగమణి దంపతులను అతి దారుణంగా కత్తులతో నరికి చంపడంపై కరీంనగర్ బార్ అసోసియేషన్ బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండిస్తున్నట్లు బార్ అధ్యక్షులు పీవీ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లెంకల రాంరెడ్డి తెలిపారు.
వెంటనే ప్రత్యేక నిఘా బృందంను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బార్ అసోసియేషన్ డిమాండ్ సభ్యులు డిమాండ్ చేసారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయవాదుల దంపతుల హత్యలపై నిరసిస్తూ రేపు 18 న కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. హత్యలో ప్రమేయం ఉన్నవారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్సరైషియా చెల్లించాలని డిమాండ్ చేసారు.
మధ్య ప్రదేశ్ లో లాగా న్యాయవాదుల రక్షణ చట్టంను వెంటనే అమలు చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే రేపు జరగాల్సిన కరీంనగర్ బార్ జనరల్ బాడీ సమావేశంను వాయిదా వేస్తున్నట్లు, న్యాయవాదులు గమనించాలని బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్కటించారు. ఉపాధ్యక్షులు ఆరెల్లి రాములు, సీనియర్ ఈసీ మెంబర్స్ పెంచాల ప్రభాకర్ రావు, నీలగిరి సుగుణాకర్ రావు, మహిళా ప్రతినిధి తిరుమల దేవి, లైబ్రరీ సెక్రెటరీ సిరికొండ శ్రీధర్ రావు, జూనియర్ ఈసీ సభ్యులు కోమటిరెడ్డి తేజ్ దీప్రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు.