వివస్త్రను చేసి…. అరగుండు గీసి…

0 7

ముంబై లో జరిగిన ఓ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.న్యూస్ 18 కథనం ప్రకారం.. వాసైకి చెందిన 26 ఏళ్ల యువతిని ఫిబ్రవరి 19న సాయంత్రం నలుగురు వ్యక్తులు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఓ చెట్టుకు ఆమెను కట్టేసి.. ఆమెను వివస్త్రను చేసి, ఆమెకు సగం గుండును గీస్తూ.. ఫోన్ లో వీడియోను తీశారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. కాళ్లు, చేతులకు కట్టిన తాళ్లను విడిచి.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అక్కడే వదిలేసి వారు వెళ్లిపోయారు.ఆమె ఎలాగోలా ఆ అడవి నుంచి బయటపడి.. రోడ్డుకు చేరుకున్న తర్వాత పొదల్లో కిందపడిపోయింది. ఆమెను చూసిన కొందరు వ్యక్తులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి.. నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే బాధిత మహిళకు వీళ్లకు సంబంధం ఉందా? ఆమె వాళ్లతో కలిసి ఎందుకు వెళ్లింది? అసలు ఈ నిర్వాకానికి వాళ్లు ఎందుకు పాల్పడ్డారన్న విషయాలపై బాధిత యువతిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఈ ఘటన వల్ల షాక్ లో ఉందని, కో లుకున్న తర్వాత ప్రశ్నించి విచారణ చేపడతామని పోలీసులు వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents