ఈతకు వెళ్లి బాలుడి మృతి
బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కేతి చరణ్ తేజ అనే 10 ఏండ్ల బాలుడు ఈతకని వెళ్లి మృత్యువాత పడ్డాడు. మిత్రులతో కలిసి బుగ్గారం మండలం చందయ్య పల్లి గ్రామ శివారు లోని ఎస్సారెస్పీ కాలువలోకి ఈతకు వెళ్ళాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈతకొట్టడానికి దూకిన చరణ్ తేజ నీటిలో మునిగి మృతి చెందాడు. బుగ్గారం ఎస్సై ఉపేంద్రా చారి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.