ప్రియుడితో మాట్లాడనివ్వని భర్త.. తట్టుకోలేకపోయిన భార్య.. ఎవరికీ అనుమానం రాకుండా..

0 0

వివాహేతర సంబంధాలు మనుషులను మృగాలుగా మార్చేస్తుంటాయి. ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు పురుషులు క్రూరంగా వ్యవహరిస్తే.. మరికొన్ని సందర్భాల్లో మహిళలు కూడా అంతే కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఓ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు కూడా షాకయ్యారు. వివరాల్లోకి వెళితే బీహార్‌కు చెందిన మహిళతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడిని నాలుగు నెలల క్రితం పెళ్లి అయ్యింది. అయితే తన భార్య తనను మోసం చేస్తూ ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అతడికి అనుమానం వచ్చింది. ఈ విషయంలో భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆమె భర్త.. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా గుర్తించాడు. దీంతో వారి మధ్య గొడవ మొదలైంది.

ఇలాంటివి మానుకోవాలని భర్త సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో.. భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తన పుట్టింటికి చేరుకుంది. అయితే కొద్దిరోజులకే భార్యను తీసుకురావడానికి పుట్టింటికి వెళ్లాడు ఆమె భర్త. అయితే అక్కడ కూడా ఆమె ప్రవర్తన మారలేదు. తన దగ్గర ఉన్న సమయంలో ఏ విధంగా వ్యవహరించిందో అక్కడ కూడా అలాగే వ్యవహరించడం మొదలుపెట్టింది. దీంతో భార్య పుట్టింట్లో కూడా భర్త ఆమెతో గొడవపడ్డాడు. దీంతో అత్తమామలు అతడిని వారించారు. వివాదాన్ని తాము పరిష్కరిస్తామని.. అప్పటివరకు తమ ఇంట్లోనే ఉండాలని కోరారు.

అయితే ఆ తరువాత రోజు భర్తతో ప్రేమగా మాట్లాడిన భార్య.. తాను ప్రియుడితో మాట్లాడటం మానేస్తానని అతడికి హామీ ఇచ్చింది. దీంతో అతడు కూడా భార్యను నమ్మాడు. అయితే ఓ రోజు రాత్రి భర్త నిద్రలోకి జారుకున్న సమయంలో ఆమె క్రూరమైన చర్యకు పాల్పడింది. అప్పటికే తన దగ్గర ఉన్న కత్తితో భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీంతో అతడు గట్టిగా అరిచాడు. వెంటనే తేరుకున్న అతడి అత్తమామలు.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents