మద్యం బాటిల్ లో పాముపిల్ల..చూడకుండా తాగేసిన మందుబాబు..!

0 2

కొన్ని రోజుల క్రితం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని పేరూరు వై జంక్షన్‌లో కూల్ డ్రింక్ బాటిల్లో పాము పిల్ల కనిపించిన వార్త సంచలనంగా మారింది. అవి విని షాక్ అయ్యాం. అటువంటిదే జరిగింది తమిళనాడులో కానీ ఈసారి కూల్ డ్రింక్ బాటిల్లో కాదు..మద్యం బాటిల్లో..! ఏపీలో వ్యక్తి బాటిల్లో ఉన్న పాముపిల్లను చూసి బాటిల్ మూత తియ్యనే లేదు. కానీ ఓ మందుబాబు మాత్రం బాటిల్లో ఉన్న పాముని చూడనేలేదు. చక్కగా సీసాలో సగం తాగేశాడు. ఆ పై బాటిల్ లో ఏదో ఉందని గమనించి చూడగా..అది పాము పిల్ల అని తెలిసి తాగిన మందు కిక్ ఎక్కకుండానే మొత్తం దిగిపోయింది. అంతే పాపం ఆగమాగం అయిపోయాడు. ఏం చేయాలో తెలీక తెగ అల్లాడిపోయాడు. తమిళనాడులో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో చివరకు ఏమైందంటే..

తమిళనాడులోని అరియాలూరు జిల్లా చుట్టమల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే 36 ఏళ్ల యువకుడు తన గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజంతా పనిచేయటంతో ఒళ్లంతా అలసిపోవటంతో కాస్తంత మందు తాగి పడుకుంటాడు. అలాగే గత బుధవారం (ఏప్రిల్ 14,2021) వ్యవసాయ పనులు ముగించుకొని వైన్ షాప్‌కు వెళ్లి..ప్రభుత్వ ఆధీనంలో నడిచే టాస్మాక్ దుకాణంలో ఓ మద్యం బాటిల్ కొనుక్కుని దాన్ని పట్టుకుని ఇంటికి వెళ్లాడు.

ఆ తర్వాత.. తెచ్చుకున్న మద్యం నుంచి సగం గ్లాస్‌లో పోసుకొని తాగాడు. ఆ తర్వాత సీసాలో అతడికి ఏదో ఉన్నట్లుగా అనుమానం వచ్చింది. పరిశీలనగా చూశాడు. అదేదో పాము పిల్లలాగా కనిపించింది. తాగింది కొంచెం కొంచెం మత్తు ఎక్కుతుండటంతో అదేదో తన భ్రమేమో అనుకున్నాడు. కళ్లు విప్పార్చుకుని మరోసారి చూశాడు. సీసా అడుగు భాగంలో చనిపోయిన పాము పిల్ల కనిపించింది.అంతే తాగింది మొత్తం దిగిపోయింది. అది చూసిన సురేష్ భయపడిపోయాడు. అప్పటికే కొంత మద్యం తాగడంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందాడు. ఆగమాగం అయిపోయాడు.

అదే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పగా..వాళ్లు కూడా కంగారుగా సురేష్‌ను హుటాహుటిన జయకొండం ఆస్పత్రికి తరలించారు. విషయాన్ని డాక్టర్లకు చెప్పారు. దాంతో మద్యం బాటిల్ లో ఉన్న పాముపిల్లను పరిశీలించిన డాక్టర్లు అతనికి వైద్యం చేశారు. ఫరవాలేదు అని భరోసా ఇచ్చారు. ఆ తరువాత సురేష్ కుటుంబ సభ్యులంతా వైన్ షాప్ మీదకు దండయాత్రకు వెళ్లారు. ఆగ్రహంగా ప్రశ్నించారు. దానికి వాళ్లు ఈ బాటిల్ మేమేమన్నా తయారు చేశామా? సీల్ వేశామా? అని ఎదురు ప్రశ్నించారు. దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేం కేవలం మద్యం మాత్రమే అమ్ముతామని స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో వాళ్లకు తెలియలేదు.

కాగా సురేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మద్యం బాటిల్‌లో పాము రావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే మద్యం షాపుల్లోనే ఇలా జరిగితే ఇక ప్రజల పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents