సంపూర్ణ లాక్ డౌన్ దిశగా ఏపీ.. 20 శాతం దాటిన పాజిటివ్ రేటు.. ఇంటింటి సర్వేలో షాకింగ్ నిజాలు

0 0

ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్నీ బంద్ చేస్తున్నారు. అత్యవసరమైన మెడికల్ తదిరత అవసరాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వారం నుంచి ఈ నిబంధనలు అమలు అవుతున్నా.. కరోనా మాత్రం కట్టడి కావడం లేదు కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

కర్ఫ్యూతో ఏ మాత్రం లాభం కనిపించడం లేదు. మధ్యాహ్నాం 12 గంటల వరకు సమయం ఇవ్వడంతో జనం అవసరం లేకున్నా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతోనే కరోనా కట్టడి కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కర్ఫ్యూ కన్నా.. లాక్ డౌనే మేలు అనే అదికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ కు కూడా అధికారులు ఇదే విషయం చెప్పినట్టు సమాచారం.. సంపూర్ణ లాక్ డౌన్ లేకుంటే కేసులు కంట్రోల్ కావడం కష్టమే అని భావిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ ఏపీలో భయానకంగా మారుతుంది. పెరుగుతున్న కేసులు, మందుల కొరత, వ్యాక్సిన్ల లేమి, ఆసుపత్రులలో దక్కని బెడ్లు, ఆక్సిజన్ అందక పోతున్న ప్రాణాలు, ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి.

మహమ్మారి కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ.. ఇప్పటికిప్పుడు అవి ఎంతవరకు ఫలితమిస్తాయన్నదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఏపీలో వైరస్ వ్యాప్తి చాలా ఉదృతంగా కనిపిస్తుంది. ఇక్కడి పరిస్థితిపై వైద్య నిపుణులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read :

ఏపీ ప్రభుత్వం ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటుంది. కానీ, ఇప్పటికే మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టేసింది. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షలలో పాజిటివిటీ రేటు పదిశాతం దాటితే ప్రమాదకరంగా భావించాల్సి ఉంది. ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి మించింది. ఐసీఎం ఆర్ పది శాతం దాటితేనే లాక్ డౌన్ విధించాలని సూచిస్తోంది. కానీ ఏపీలో మాత్రం పాజిటివ్ రేట్ 20 శాతం దాటుతోంది.

ఏపీలోని 11 జిల్లాలలో పాజిటివిటీ 20 శాతానికి మించిందని నిర్ధారణవగా విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో మరింత ఆందోళనకర ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. దీంతో మరో 6 నుండి 8 వారాల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ కాకుండా.. లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తుంది.

ఏపీలో ఫీవర్ సర్వేలోనూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. చాలా గ్రామాల్లో సగానికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. చాలామందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నా.. పరీక్షలు చేయించుకోవాడానికి ముందుకు రావడం లేదని గుర్తించినట్టు తెలుస్తోంది. అందరికీ పరీక్షలు నిర్వహిస్తే.. పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents