ఇంట్లో పనిచేస్తున్న యువతి ఫొటోలను..
తన ఇంట్లో పనిచేస్తున్న ఓ యువతికి సంబంధించిన ఫొటోలను వాట్సాప్ లో షేర్ చేస్తున్న యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఓ యువతి (19) స్థానికంగా ఓ ఇంట్లో పనులు చేస్తోంది. ఇంటి యజమాని కుమారుడు (23) గత కొన్ని రోజులుగా ఆమెను ప్రేమ పేరుతో వేధించసాగాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫొటోలను తీసి తన వాట్సాప్లో పెట్టుకోవడంతో పాటు షేర్ చేస్తున్నాడు. ఈ విషయమై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.