కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కు కరోనా పాజిటివ్
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు క.రో.నా బారిన పడ్డారు. ఆయన మొన్న హైదారాబాద్ లో జరిగిన టి.ఆర్.యస్ ప్లీనరి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యేకు అనారోగ్యం చేసింది. రెండు రోజుల పాటు జ్వరం ఉండటంతో గురువారం క.రో.నా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆయనకు క.రో.నా పాజిటివ్ అని తేలింది. తనతో కార్యక్రమానికి వచ్చిన, తనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతానికి విద్యాసాగర్ రావు ఇంటిలో హాం ఐసోలేషన్ లో ఉంటున్నారు.