రాజన్న సన్నిధిలో కార్తీక సందడి
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో కార్తీక సందడి నెలకొంది. గురువారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కార్తీకమాసం సందర్భంగా ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో లఘుదర్శనం అమలు చేశారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు బోనం మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.