Print Friendly, PDF & Email

దోశలు వేయడానికి నాన్‌స్టిక్ ప్యాన్‌ వాడకూడదట!

0 61

 గత దశాబ్ద కాలంగా రకరకాల అనారోగ్యాల భారిన పడుతూ ఇప్పుడిప్పుడే మన పూర్వీకుల ఆహారపు అలవాట్లు గుర్తు చేసుకుంటూ జీవనశైలిని మార్చుకునే ప్రయత్నంలో మంచి అలవాట్లను నేర్చుకుంటున్నారు మరియు అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటున్నారు.

ప్రతి రోజు ఉదయం తీసుకునే అల్పాహారం కోసం ఎంతో రుచికరమైన దోసలు కోసం నాన్ స్టిక్ పెనం ఉపయోగించడం సహజమే, అయితే ఆరోగ్య దృష్ట్యా నాన్ స్టిక్ పెనాలని ఉపయోగించడం మెల్లిగా మానేస్తున్నారు, దానికి బదులుగా ఐరన్ తవ్వాను ఉపయోగిస్తున్నారు. కాకపోతే ఐరన్ పెనంపై దోశలు వేయడం సులువు కాదు అని భయపడి పక్కన పెడుతున్నారు. కొంతమందికి కొన్ని సార్లు మాత్రమే మంచి దోశలు తయారు చేసుకోగలుగుతారు. మరికొన్నిసార్లు రుచిగా రాకపోవడం, విరిగి పోవడం వంటివి జరుగుతాయి.

అలాంటప్పుడు ఐరన్ పెనంను స్క్రబ్బర్ పెట్టి గట్టిగా రుద్ది వాష్ చేయకూడదు అలా చేయడం వల్ల ఐరన్ పెనం పాడవుతుంది. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను తెలుసుకొని రుచికరమైన దోశల కోసం ప్రయత్నించండి. సాంప్రదాయంగా చేసే వంటలు అన్ని కూడా ఐరన్ పాత్రలలోని వండడం ఉత్తమం అని మరియు ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు. టెఫ్లాన్ మరియు నాన్ స్టిక్ పెనాలలో టాక్సిక్ లక్షణాలు కలిగి ఉంటాయి.

వీటిలో ఎక్కువగా కెమికల్స్ ఉండటం వల్ల ఆహారంలో కలిసి హార్మోన్స్ సమతుల్యతకు కారణం అవుతాయి. ఐరన్ పాత్రల్లో వంటలు చేసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత ఐరన్ శాతం కూడా అందుతుంది. దాంతో ఎనీమియా వ్యాధి రాకుండా ఉంటుంది మరియు ప్రస్తుతం పరిస్థితులకు అవసరం అయ్యే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీ ఐరన్ పెనంను నాన్ స్టిక్ పెనంలా మార్చాలంటే దోసెల పెనం మీద పిండి వేసే ముందు ఒక ఉల్లిపాయను నూనెలో ముంచి పెనంను గ్రీజ్ చేసుకోవాలి .

ఇలా చేయడం వల్ల దోశ పెనానికి అంటుకోకుండా కరకరలాడుతూ వస్తుంది. దోశ పెనంను ఎప్పుడూ కూడ పరోటా, చపాతీ మరియు శాండ్విచ్ వంటి ఆహార పదార్ధాలు వండుకోవడానికి ఉపయోగించ వద్దు. దోసెలకు సెపరేట్ గా ఒక పెనంను మెయింటెయిన్ చేయండి. దోస వేసే ముందు ఒక క్లాత్ తో పెనంను శుభ్రం చేసుకుని, తర్వాత 2 నుండి 3 చుక్కల నూనె వేసుకొని అప్పుడు దోశ వేసుకోండి.

ఇలా చేయడం వల్ల దోస పెనంకు అంటుకోకుండా ఉంటుంది. ఒకవేళ మీరు మిగిలిపోయిన పదార్థాల నుండి దోశ పిండిని తయారు చేసుకుంటే పదార్థాల యొక్క కొలతలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దోసెల పిండి పర్ఫెక్ట్‌గా రావాలంటే నాలుగు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినప్పప్పు వేసుకోవాలి మరియు రాత్రంతా నానబెట్టి దోశలు వేసుకుంటే బాగా వస్తాయి. సమయం లేక పోతే రెండు మూడు గంటల వరకు నానబెట్టుకోండి, ఆ తర్వాత గ్రైండ్ చేసుకొండి.

ఇలా చేయడం వల్ల పిండి ఎంతో మృదువుగా వస్తుంది. దాంతో పాటు దోసెలు కూడా రుచికరంగా ఉంటాయి. పిండిని ఫ్రిజ్ లో స్టోర్ చేసేటప్పుడు ఒక స్టెయిన్లెస్ స్టీల్ కి బదులుగా ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కంటైనర్ లేదా సిరామిక్ పాత్రల్లో పెట్టుకోండి. ఇలా అయితే ఇంకొన్ని రోజులు నిల్వ ఉంటుంది.

దోస పిండిని పెనం పై వేసే ముందు పెనం వేడి గా ఉందో లేదో చూసుకోండి. దోస వేసేటప్పుడు పెనం మధ్యలో నుండి మొదలు పెట్టి రౌండ్ గా తిప్పుతూ ఉండండి, అలా దోస ఆకారం వచ్చేలా చేయండి, ఎక్కువసార్లు పిండిని గరిటెతో కల్పవద్దు. దోసను ఇంకొకవైపు తిప్పేటప్పుడు చాలా నె మ్మదిగా చుట్టూ పైకి తీస్తూ ఉండండి ఆ తర్వాతనే ఫ్లిప్ చేయండి. ఇలా చేయడం వల్ల విరిగిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీకు కరకరలాడే దోసెలు ఇష్టమైతే ఎప్పుడూ కంటే కొద్దిగా నూనె కొంచెం ఎక్కువ వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఎక్కువ సేపు ఉంచండి. ఇలా చేయడం వల్ల దోశ గోల్డెన్ కలర్ లోకి మారుతుంది, క్రిస్పీగా ఉంటుంది. దోశను చట్నీ, పొడి, నెయ్యి లేదా బెల్లంతో తినండి. చాలా రుచిగా ఉంటుంది. దోసెలు వేసుకుని పావుగంట ముందు దోశ పిండి ని ఫ్రిజ్ లో నుండి బయట పెట్టుకోండి, ఇలా చేయడం వల్ల దోశలు బాగా వస్తాయి. మీరు కూడా కరకరలాడుతూ రుచిగా ఉండే దోసలు తయారు చేసుకుని మంచిగా తినాలంటే ఈ చిట్కాలను తప్పకుండా పాటించండి.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents