Print Friendly, PDF & Email

విచిత్ర రీతిలో రనౌటైన షోయబ్‌ మాలిక్‌.. మరీ ఇంత సోమరి తనమా అంటూ ఏకిపారేస్తున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌..

0 34

ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం పాకిస్తాన్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొదటి మ్యాచ్‌ జరిగింది.

ఓటమి అంచుల వరకు వెళ్లిన పాకిస్తాన్‌ నాలుగు వికెట్ల తేడాతో నాలుగు బంతులు మిగిలి ఉండగా విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో పాక్‌ సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ విచిత్రరీతిలో రనౌట్‌ అయ్యాడు. క్రీజ్‌లో మరీ బద్ధకంగా వ్యవహరించిన అతను అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సీనియర్‌ క్రికెటర్‌వై ఉండి ఇంత బద్ధకంగా ఆడతావా.. అదీ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో’ అంటూ నెటిజన్లు షోయబ్‌ను ఏకిపారేస్తున్నారు.

సీనియర్‌ ఆటగాడివై ఉండి.. ఇంత బద్ధకమా..
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. 128 పరుగుల సులభమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌.. బాబర్‌ అజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, హైదర్‌ అలీ వికెట్లను తొందరగా కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన షోయబ్‌ మాలిక్‌ ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌లో ముస్తాఫిజుర్‌ వేసిన బంతిని ఎదుర్కొనడంలో విఫలమయ్యాడు. బంతిని గమనించకుండా క్రీజు దాటి బయటికు వచ్చాడు. దీంతో బాల్ అందుకున్న బంగ్లా కీపర్‌ నేరుగా వికెట్లకు త్రో చేశాడు.

డైరెక్ట్‌ హిట్‌ అవ్వడంతో బెయిల్స్‌ ఎగిరిపడ్డాయి. మాలిక్‌ క్రీజులోకి వచ్చాడని చాలామంది భావించారు. కానీ అసలు ట్విస్ట్‌ అక్కడే ఉంది. క్రీజులోకి వచ్చిన మాలిక్‌ తన బ్యాట్‌ను మాత్రం గాలిలోనే ఉంచాడు. బంగ్లా ఆటగాళ్లు అప్పీల్‌ చేయడం.. థర్డ్‌అంపైర్‌ ఔట్‌ అని ప్రకటించడంతో మాలిక్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 4 వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents