ఆసుపత్రిని సందర్శించిన అదనపు పాలనాధికారి
కరీంనగర్ జిల్లా మానకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ సందర్శించారు. జిల్లాలో కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి, గ్రామ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి సేవలు అందుతున్నాయని, ఆసుపత్రికి వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జువేరియా ఉన్నారు.