Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఈ వారం సమావేశం కానున్న సెలక్షన్ కమిటీ..

0 17

Virat Kohli ODI Captaincy: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఈ వారం సమావేశం కానున్న సెలక్షన్ కమిటీ..

భారత వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ భవిష్యత్తు ఈ వారంలో తేలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికా పర్యటనకు క్లియరెన్స్ ఇస్తే జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఈ వారం సమావేశమవుతారు.

చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ కోహ్లీని వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగించాలా లేదా అనేదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలో భారత జట్టు టూర్ కొనసాగుతుందని బీసీసీఐ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అయినప్పటికీ వారు ఆ దేశంలో కొత్త COVID-19 వేరియంట్ పుట్టుకురావటంతో అక్కడి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ”భారత జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తాం. మేము మా వైపు నుంచి అన్ని సిద్ధం చేసి, ఆపై ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉంటాం. పర్యటనను నిలిపివేయమని ప్రభుత్వం మాకు చెబితే, మేము చేస్తాం, అయితే మేము జట్టును ఎంపిక చేసి సిద్ధంగా ఉంచాలి” అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి బుధవారం చెప్పారు.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. భారత్ రాబోయే ఏడు నెలల్లో విదేశాల్లో ఆరు (దక్షిణాఫ్రికా,ఇంగ్లండ్‎తో మూడు చొప్పున) మ్యాచ్‎లు ఆడనుంది. అలాగే తొమ్మిది ODIలు ఉన్నాయి. ప్రస్తుతం బీసీసీఐ రెండు ఆలోచనలు చేస్తుంది. కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నందున కోహ్లీని కెప్టెన్‎గా కొనసాగించడం. భారతదేశంలో జరగనున్న 2023 ODI ప్రపంచ కప్ కోసంశక్తివంతమైన జట్టును సిద్ధం చేయడానికి రోహిత్‌కు తగినంత సమయం ఇవ్వడం. అయితే కోహ్లీ వన్డే కెప్టెన్‌గా ఉంచడంపై బీసీసీఐ అధ్యక్షుడు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. కోహ్లీ కెప్టెన్‎గా ఏ ఒక్క ఐసీసీ టోర్నీ గెలవలేదు. వ్యక్తిగతంగా అతని రికార్డు బాగుంది.

ప్రస్తుతానికి BCCI దక్షిణాఫ్రికాతో పూర్తి సిరీస్ ఆడేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. అయితే, మూడు టెస్టుల సిరీస్‌ను కుదించడంపై చర్చలు జరుగుతున్నాయి. సౌతాఫ్రికా టార్‎లో భారత్ మూడు టెస్ట్‎లు ఆడనుంది.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents