Print Friendly, PDF & Email

మరోసారి ఊహించని ఎలిమినేషన్.. పింకీకి వాళ్ల మద్దతు.. టాప్ కంటెస్టెంట్‌ ఔట్!

0 38

తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుని దాదాపు ఐదేళ్లుగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు భారీ రెస్పాన్స్‌ను అందుకుంటూ సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ వెళ్తోంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్ సైతం అదే రీతిలో ముందుకు సాగుతోంది. ఇక, ఇప్పుడిది చివరి దశకు చేరుకోవడంతో మరింత రంజుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ వారానికి సంబంధించిన ఐదుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. దీంతో అందరి కంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్న ప్రియాంక ఈ వారం ఎలిమినేట్ అవడం ఖాయమన్న టాక్ వినిపించింది. అయితే, చివరి రోజు ఓటింగ్ ఒక్కసారిగా మారిందట. దీంతో టాప్ కంటెస్టెంట్‌కు ప్రమాదం వచ్చిందని తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

పన్నెండు వారాలు.. 12 మంది అవుట్

తాజా సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 12 వారాలకు పన్నెండు మంది సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత, ఏడో వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో, తొమ్మిదో వారంలో విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారంలో అనారోగ్యంతో వెళ్లిపోవాల్సి వచ్చింది.

టాప్ 5పై అంచనాలు.. ఎవరుంటారు

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో మరో రెండు వారాలు మాత్రమే మిగిలిన ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఏడుగురు కంటెస్టెంట్లలో టాప్ 5గా నిలిచి ఫినాలేకు చేరుకునే వాళ్లు ఎవరన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరికి తోచిన పేర్లను వాళ్లు వినిపిస్తున్నారు. అదే సమయంలో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కూడా పోటాపోటీగా టాస్కులు ఆడుతున్నారు. ఇక, ఈ వారం జరిగిన ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులో శ్రీరామ చంద్ర విజయం సాధించి ఫినాలేకు అర్హత సాధించాడు. దీంతో ఆరుగురిలో నలుగురు మాత్రమే తుదిపోరులోకి రాబోతున్నారు.

13వ వారం నామినేట్ అయిందెవరు

బిగ్ బాస్ షో ఐదో సీజన్ చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తిని పెంచేలా సరికొత్త టాస్కులు కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్లు కూడా స్ట్రాటజీలతో ముందుకు వస్తున్నారు. దీంతో నామినేషన్ ప్రక్రియలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇందులో వీలైనంత ఎక్కువ మందినే ఉంచుతూ వస్తున్నారు. ఇక, 13వ వారానికి సంబంధించి కెప్టెన్‌గా ఉన్న షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ మినహా మానస్, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్రలు నామినేట్ అయిన విషయం తెలిసిందే. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై చాలా రకాల వార్తలు వస్తున్నాయి.

శ్రీరామ్ టాప్‌లోనే… తర్వాత మానస్

బిగ్ బాస్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో కంటెస్టెంట్ల అభిమానులు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంతో పాటే సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇక, 13వ వారానికి సంబంధించిన ఓటింగ్ ఆసక్తికరంగా సాగుతున్నట్లు అనిపిస్తోంది. అయితే, ఇందులో ఆరంభం నుంచీ సింగర్ శ్రీరామ చంద్ర టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడని అంటున్నారు. అనధికారిక పోల్స్‌లో సైతం అతడి హవానే కనిపిస్తోంది. రెండో స్థానంలో మాత్రం మొదట్లో సిరి హన్మంత్ ఉన్నా.. ఓటింగ్ పూర్తయ్యే సమయానికి మానస్ వచ్చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

డేంజర్ జోన్‌లో మాత్రం వాళ్లిద్దరేనా

13వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో శ్రీరామ చంద్ర, మానస్, సిరి హన్మంత్‌లకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అనధికారిక పోల్స్‌లో సైతం వీళ్లు ముగ్గురే మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. దీంతో వీళ్లంతా ఈ వారం సేఫ్ అయిన కంటెస్టెంట్లు అని అంటున్నారు. అయితే, ఈ జాబితాలో మిగిలిన ఇద్దరు అంటే ఆర్జే కాజల్, ప్రియాంక సింగ్ మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నారని మొదటి నుంచీ అంటున్నారు. ఇందులో కాజల్‌కు కూడా మంచిగానే ఓట్లు వస్తున్నా.. ఆమె నాలుగో స్థానానికే పరిమితం అవ్వాల్సి వచ్చిందని టాక్.

మరోసారి ఊహించని ఎలిమినేషన్

బిగ్ బాస్ చివరి దశకు చేరుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గత వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయిన తర్వాత ఈ షో మరింత సంక్లిష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో 13వ వారం కూడా ఊహించని ఎలిమినేషన్ ఉండబోతుందని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ వారం ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రియాంకతో పోలిస్తే ఆమెకు ఎక్కువ ఓట్లు పోలైనా.. చివరి రోజు పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. దీంతో ఈ ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారిపోయింది.

ప్రియాంక సింగ్‌కు భారీగా మద్దతు

ఈ వారం మొదటి నుంచీ ప్రియాంక సింగ్ చివరి స్థానంలోనే కొనసాగుతూ వచ్చిందట. అయితే, చివరి రెండు రోజులు మాత్రం ఆమెకు ఊహించని రీతిలో మద్దతు లభించిందని అంటున్నారు. రెండు రోజుల క్రితమే తమన్నా సింహాద్రి వర్గం ఆమెకు సపోర్ట్ ప్రకటించింది. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన కొందరు కంటెస్టెంట్ల ఫ్యాన్స్ కాజల్‌కు వ్యతిరేకంగా ప్రియాంకకు సపోర్ట్ చేశారట. దీనికితోడు చివరి రోజు సన్నీతో ఆమె గొడవ పడడం కూడా నష్టాన్ని తెచ్చేలా మారిందని అంటున్నారు. ఇది బిగ్ బాస్ షో కాబట్టి ఏది జరిగినా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents