బిపిన్ రావత్ గురించి ఈ ఆశ్చర్యకరమైన విషయాలు మీకు తెలుసా?
నిన్న మధ్యాహ్నం తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘోర ప్రమాద ఘటనలో బిపిన్ రావత్ తో పాటు మరో 12 మంది ప్రాణాలను కోల్పోయారనే సంగతి తెలిసిందే. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ గా పని చేస్తున్న బిపిన్ రావత్ వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీస్ కాలేజ్ లో లెక్చర్ ఇవ్వడానికి వెళ్లిన సమయంలో ప్రాణాలను కోల్పోయారు.
ఈ కాలేజ్ కు బిపిన్ పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. ఉత్తరాఖాండ్ లోని పౌరీ జిల్లాలో బిపిన్ రావత్ జన్మించారు. డెహ్రాడూన్ లోని కాంబ్రియాల్ హాల్ పాఠశాల, సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్ లో బిపిన్ రావత్ చదువుకున్నారు. పాఠశాల విద్య పూర్తైన తర్వాత బిపిన్ రావత్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ లో బిపిన్ రావత్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లిన బిపిన్ రావత్ అక్కడ హైయర్ కమాండ్ కోర్స్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత దేవీ అహల్య యూనివర్సిటీలో బిపిన్ రావత్ ఎంఫిల్ చదివారు. భారత సైన్యాధ్యక్షుడిగా బిపిన్ రావత్ అత్యుత్తమ సేవలను అందించారు.