బూరుగుపల్లిలో రోడ్డు ప్రమాదం
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో సుమారు 12 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలలోకి వెళితే… భూరుగుపల్లి కి చెందిన దూలం వెంకటేశం s/o రామస్వామి కిరాణా షాప్ నుండి సరుకులు తీసుకుని ఇంటికి వెళుతుండగా బత్తిని శ్రీధర్ గౌడ్ కు సంబంధించిన వెల్డింగ్ షాప్ ఎదురుగా లింగంపల్లి మీదుగా స్పీడ్ గా వస్తున్న రాలపల్లి కి చెందిన స్వామి యొక్క ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. దానితో వెంకటేశం తలకు తీవ్ర గాయాలై తీవ్ర రక్తస్రావం జరిగింది.
అది గమనించిన స్థానికులు హుటాహుటిన గాయపడిన వ్యక్తిని కారులో ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం సంఘటనా స్థలం వద్దనే వదిలి వెళ్లారు. గాయపడిన వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ద్విచక్ర వాహనదారుడు యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనను బట్టి చూస్తే అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.