ఉదయ్ భానుతో బాలయ్యకు ఎఫైర్ అంటూ నెట్టింట్లో షాకింగ్ వార్తలు..

0 27

ఒకప్పుడు బుల్లితెరపై తన గల గల మాటలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న యాంకర్ ఉదయభాను. ఇప్పుడు బుల్లితెరపై యాంకర్ సుమ హవా నడుస్తుంది కానీ అప్పట్లో మాత్రం ఉదయభాను హవానే ఉండేది. ప్రతి ఒక్కరితో సరదాగా ఉండేది ఉదయభాను. తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. తొలిసారిగా ఎర్రసైన్యం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు, ఎంటర్టైన్మెంట్ షోలలో యాంకర్ గా చేసింది. పలు సీరియల్ లో కూడా నటించింది. ఉదయభాను ఒక యాంకర్ గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారింది.

అప్పట్లో తన పై చాలా పుకార్లు వచ్చాయి. అయినా కూడా తను వాటిని పట్టించుకోలేదు. వాటిని ఎదుర్కొని మరి తన వృత్తి ఏంటో తానే నిరూపించుకుంది. ఓ సారి మాత్రం బాలయ్యతోనే ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం..

మామూలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య గురించి తెలియని వారెవ్వరు లేరు. నటుడుగా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో విపరీతమైన అభిమానం ఉంది. ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ యంగ్ హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నాడు బాలయ్య.

పైగా ఇటీవల అఖండ సినిమాతో కెరీర్ పరంగా బెస్ట్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఇక బాలయ్య కూడా గతంలో పలు పుకార్లు ఎదుర్కొన్నాడు. కానీ ఆ పుకార్లు ఆయనను ఏమీ చేయలేవనే చెప్పాలి. దీంతో ఓ సారి ఉదయభానుతో బాలయ్యకు సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. కానీ బాలయ్య అవేవి పట్టించుకోకుండా ఉదయభానుతో మామూలుగానే మాట్లాడేది. ఇటీవలే ఉదయభాను బాలయ్య నటించిన అఖండ సినిమా ప్రమోషన్స్ భాగంలో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక అఖండ సక్సెస్ మీట్ లో కూడా పాల్గొనగా అందులో కొన్ని విషయాలు పంచుకుంది ఉదయభాను. బాలయ్య బాబు లాంటి మహానుభావుడు లాంటి మరో వ్యక్తిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే చూడలేదని తెలిపింది. ఎవరు ఏమన్నా సరే తనకు ఎవరు ఇంకో షో ఇవ్వకున్నా సరే అంటూ.. తన గుండెల మీద చెయ్యి వేసుకుని మరి చెప్తున్నాను అంటూ.. బాలయ్య బాబుకు వేరెవరు సాటిలేదని, హాట్స్అప్ బాలయ్య అంటూ ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి అని పొగిడింది. గతంలో ఎన్నోసార్లు బాలయ్య ఈవెంట్లలో చేశానని తెలిపింది. ఇక బాలయ్య మిగతా హీరోల కాకుండా నిదానంగా వచ్చి కూర్చునేవాడిని ఈవెంట్ పూర్తయ్యేవరకు ఉండేవాడని తెలిపింది.అలా ఆయన గొప్పదనానికి ఎన్నోసార్లు థాంక్యూ అని చెప్పాను అంటూ ఆ సమయంలో తనమీద ట్రోల్స్ నడిచాయి అని తెలిపింది. తనకు బాలయ్య బాబుకు మధ్య ఏదో ఉందని కూడా అన్నారని.. బట్ ఐ డోంట్ కేర్ అంటూ.. ఎందుకంటే బాలయ్య బాబుకి అభిమానులుగా మారిన తర్వాత దేనికైనా సిద్ధంగా ఉండాలి అని తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents