కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపు టీఆర్ఎస్ నిరసన కార్యక్రమం
మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు రేపు అనగా సోమవారం
(20వ తేదీన) తలపెట్టిన కార్యక్రమంకు (యాసంగిలో వడ్లుకొనమని రైతుల పై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష పై నిరసన కార్యక్రమంకు) సంబంధించి గ్రామానికి ఒక్క సంతకాల సేకరణ ప్లెక్సీ, మార్కర్ పెన్ను, ప్లకార్డ్స్, నల్లా జెండా, తాడు, జేబుకు నల్ల రిబ్బన్స్ సంతకాల రిజిస్టర్ కు సంబందించిన మెటీరియల్ ఈరోజు తమ తమ మండల అధ్యక్షులకు అందజేయబడును. వారి ద్వారా సమావేశాని కి వస్తున్న ప్రతి గ్రామానికి సంబందించిన సర్పంచు లు,ఎంపీటీసీ లు గ్రామశాఖ అధ్యక్షులు, రైతు బందు అధ్యక్షులు కలసి తీసుకోవలెను.
మీరు మీ, మీ గ్రామాలలోకి మెటీరియల్ తీసుకొని వెళ్లిన తర్వాత ప్రజాప్రతినిధులు, గ్రామశాఖ, రైతు బందు సమితి వారు అందరు కలసి సమావేశం ఏర్పాటు చేసుకొని రైతులను, మన కార్యకర్తలను అధిక సంఖ్యలో సమీకరించే విధంగా కో ఆర్డినెట్ చేసుకొనే ప్లాన్ ఈ రోజే చేసుకొని రేపటి ప్రోగ్రాం విజయవంతం చేయగలరు.
నల్ల బ్యాడ్జిలు, నల్ల షర్టులు ధరించి, ప్లకార్డ్స్ చేతపట్టుకొని ర్యాలీ తీసి నల్ల జెండా ఎగురవేసి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను తయారు చేసి చావు డప్పుచప్పులతో ఊళ్ళో త్రిప్పి దహనం చేయాలి.
అనంతరం ప్లెక్సీలో రైతుల సంతకాలు సేకరించి మీకు ఇస్తున్న 10 పేజీల రిజిస్టర్లో రైతుల సంతకాలు పెట్టించి తమ తమ మండల అధ్యక్షులకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖమంత్రి, గంగుల కమలాకర్ తెలిపారు.