Print Friendly, PDF & Email

సిరి వల్లే షన్ను ఓడిపోయాడా..??

0 32

బిగ్‌బాస్ ముగిసింది… అందరూ ఊహించినట్టుగానే సన్నీ విజేతగా నిలిచాడు. రన్నరప్‌గా షన్ను నిలవడం నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే. ఆ స్థానంలో అందరూ ఊహించింది శ్రీరామ్‌ని.

ఎందుకంటే షన్ను ఆటాడినట్టు ఎక్కడా కనిపించలేదు. సిరిని అతుక్కుని తిరగడానికే ఆయన మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. షన్ను విజేతగా నిలవకపోవడంతో ఆయన అభిమానులంతా నిరాశలో ఉండడంతో పాటూ, సిరిపైనే కోపంగా ఉన్నట్టు సమాచారం.

ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే
సన్నీతో పోల్చుకుంటే బిగ్‌బాస్ హౌస్‌లోకి రాకముందు షన్నుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దీంతో షో మొదలైనప్పటి నుంచే షన్నుయే విజేత అనుకున్నారు జనాలు. యూట్యూబ్ వీడియోలతో లక్షల కొద్దీ అభిమానులను సంపాదించుకున్నాడు. ‘అరె ఏంట్రా ఇది’ డైలాగుతో చాలా ఫేమస్ అయిపోయాడు. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా హౌస్లోకి అడుగుపెట్టిన షన్ను రోజులు గడుస్తున్న కొద్దీ తనలోని లక్షణాలను ఒక్కొక్కటిగా బయటిపెట్టుకుంటూ వచ్చాడు. అతడి ప్రవర్తన హౌస్ మేట్స్ నే కాదు చూసే జనాలకు కూడా చిర్రెత్తుకొచ్చేలా తయారైంది. అంతెందుకు అయిదేళ్ల పాటూ రిలేషన్ షిప్ లో ఉన్న ప్రియురాలు దీప్తి సునయన కూడా షన్నును సపోర్ట్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. ఏదో చివరలో ఓ ఇన్ స్టా పోస్టు పెట్టి ‘అతడిని అతడిలా ఆడనివ్వండి’ అంటూ కామెంట్ చేసి ఊరుకుంది.

తల్లి వచ్చి చెప్పినా మారలేదు
రెండు వారాల క్రితం కుటుంబసభ్యులను పంపించాడు బిగ్ బాస్. షణ్ముక్ తల్లి వచ్చి అతడికి, సిరికి ‘గేమ్‌ను గేమ్‌లా ఆ డండి, మరీ ఎమోషనల్ అయిపోవద్దు’ అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చింది. అయినా తల్లి చెప్పింది తలకెక్కించుకోలేదు ఈ మహానుభావుడు. తరువాత సిరి తల్లి వచ్చి ‘ప్రతి దానికి కౌగిలించుకోవడం నచ్చడం లేదు’ అని చెప్పింది. అలా చెప్పాక ఇద్దరూ హగ్ లిచ్చుకోవడం మరీ ఎక్కువ చేశారు. ఇది షన్నుపై నెగిటివ్ ఇంప్రెషన్‌ను పెంచింది. అంతేకాదు మీ మమ్మీ అలా అంటుందా అంటూ రచ్చరచ్చ చేశాడు. చూసే జనాలకు ఎంత చికాకుగా అనిపించిందో అతని వ్యవహారం.

ఫ్రెండ్సంటే హగ్గులిచ్చుకోవాలా?
ప్రతిసారి ఇద్దరూ హగ్ పేరుతో అతుక్కోవడం… ‘ఫ్రెండ్లీ హగ్’ అని చెప్పుకోవడం పరిపాటైంది. షన్ను చెప్పిన ప్రకారం ఫ్రెండ్సంతా అలా చీటికిమాటికి హగ్ పేరుతో అతుక్కోవాలా? అనే చర్చలు కూడా మొదలయ్యాయి. అందుకే ‘హగ్గుల స్టార్’ అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ సిరితో షన్ను చేసిన అతి… అతని కొంపే ముంచింది. టైటిల్ నుంచి దూరం చేసింది.

కారణాలు ఎన్నో…
1. తాగి బండి నడిపి యాక్సిడెంట్ చేశాడు షన్ను. ఆ సమయంలో వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకునేందుకు హౌస్లోకి వెళ్తున్నా అని చెప్పి వెళ్లాడు. కానీ మరింత నెగిటివిటీని మూటగట్టుకుని బయటికి వచ్చాడు.

2. మొదటి రెండు మూడు వారాలు అసలే ఆటే ఆడలేదు. యాపిల్స్ తింటూ ఓ బెంచ్ మీద కూర్చునే వాడు. నాగార్జున ఓ వీడియో చూపించి ‘ఒరే ఏంట్రా ఇది… కాస్త ఆడరా’ అని కామెడీగా క్లాసు పీకాక ఆట మొదలుపెట్టాడు.

3. ఆటలో సిరికి బాగా దగ్గరైపోయాడు. దాంతో హగ్గుల పర్వం మొదలైంది. వామ్మో వీరి హగ్గులు చూశాక కౌగిలించుకోవడమంటేనే జనాలకు అసహ్యం కలిగేలా అయింది పరిస్థితి.

4. చాలా సందర్భాల్లో ఆటను ఆటలా చూడకుండా విపరీతమైన యాటిట్యూట్ చూపించాడు షన్ను.

5. నిత్యం మోజ్ రూమ్ లో కూర్చుని సిరితో కబుర్లు, ప్రతి దానికి అలకలు, ఆ అలకలు తీర్చుకోవడం… ఇదే ప్రాసెస్ తప్ప ఆటపై తక్కువ ధ్యాస పెట్టాడు.

6. సిరిని వేరే ఎవరితోనైనా క్లోజ్ అయితే భరించలేకపోవడం, ఆమెను పూర్తిగా తన కంట్రోల్ లో పెట్టుకోవాలన్న అతని ఆలోచనలు ప్రజలకు అర్థమైపోయాయి.

7. షన్ను కామెడీ చేయడు. వేరే వాళ్లు కామెడీ చేస్తే తీసుకోడు. పక్కవాళ్లని ఎన్ని మాటలైనా అనేస్తాడు. తనని మాత్రం ఏమీ అనకూడదంటాడు… ఏం లక్షణం ఇది.

8. ప్రతి టాస్కులోనూ అలుగుతాడు. అందరూ కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే తాను మాత్రం చాలా ముఖం మాడ్చుకుంటాడు. అతడిని ఓదార్చేందుకు వెనుక సిరి ఓవరాక్షన్. వీళ్లిద్దరినీ భరించినందుకు ప్రజలకు కూడా ఒక ట్రోఫీ ఇవ్వాల్సిందే.

9. షన్నుకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ అని బిగ్ బాస్ చూసిన వారికి అర్థమవుతోంది. అంతేకాదు కామెడీ యాంగిల్ అస్సలు లేదు మనోడికి. కామెడీ చేస్తే అందరూ నవ్వుతారు… ఇతను మాత్రం రివర్స్ మూడు ముడుచుకుంటాడు.

10. తాను చెబితే అందరూ వినాలి, తాను మాత్రం ఎవరి మాట వినడు. సిరి విషయంలో కూడా ఇంతే. ఆమె ఏం చెప్పినా వినడు, రాద్ధాంతం చేస్తాడు షన్ను.

11. షన్ను ప్రవర్తన ఇలా ఉన్నా కూడా అతడు సెకండ్ స్థానం వరకు వచ్చాడంటే మామూలు విషయం కాదు. యూట్యూబ్ అభిమానులు చాలా కష్టపడినట్టే లెక్క. అయినా గెలవలేకపోయాడు. సిరితో స్నేహాన్ని ఒక పరిధిలో ఉంచి, కాస్త కామెడీ యాంగిల్ ని కూడా బయటకు తీసి ఆడుంటే షన్ను కు విజయావకాశాలు పుష్కలంగా ఉండేవి.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents