Print Friendly, PDF & Email

సన్నీ ప్రైజ్‌మనీలో భారీ కోత.. అన్ని కలిపి కోటి పైనే.. చేతికొచ్చేది మాత్రం ఇంతే!

0 32

తెలుగు బుల్లితెరపై కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ క్రమంలోనే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది.

ఇలా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా ముగించింది. ఇక, ఇప్పుడు ఐదో సీజన్‌ను కూడా అలాగే కంప్లీట్ చేసుకున్నారు. దాదాపు 15 వారాల పాటు అలరించిన ఈ సీజన్‌ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో ఐదో విన్నర్‌ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.

ఆరంభం నుంచీ సరైన ఆటతీరుతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించిన వీజే సన్నీనే టైటిల్ వరించింది. ఈ నేపథ్యంలో అతడు బిగ్ బాస్ షో ద్వారా సంపాదించిన ఆదాయం గురించి తెలుసుకుందాం పదండి!

వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలే
 15 వారాలు, వంద రోజులకు పైగానే తెలుగు ప్రేక్షకులకు మజాను పంచింది బిగ్ బాస్ ఐదో సీజన్. ఎన్నో అంచనాలతో ప్రారంభం అయిన ఇందులో ఎన్నో సరికొత్త టాస్కులు చూపించారు. అలాగే, అప్పుడప్పుడూ కొన్ని ట్విస్టులు కూడా కనిపించాయి. ఇలా దాదాపు మూడు నెలల పాటు అలరించిన ఈ సీజన్ ఆదివారంతో ముగిసింది. తారల తళుకుబెళుకుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. ఇందులో గతంలో ఎన్నడూ చూడనంత మంది గెస్టులు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, మాజీ కంటెస్టెంట్లు డ్యాన్సులతో మెప్పించారు. నాగార్జున హోస్ట్‌తో ఆకట్టుకున్నాడు.

5వ సీజన్‌ విజేతగా నిలిచిన సన్నీ

బిగ్ బాస్ నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని భారీ బజ్‌తో మూడు నెలల క్రితమే ప్రారంభం అయింది. ఈ సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు పోటీ పడ్డారు. వీరిలో వీజే సన్నీ ఆదివారం జరిగిన ఫినాలేలో విజేతగా నిలిచాడు.

అలా వచ్చాడు.. ఇలా గెలిచాడు

తాజాగా ముగిసిన ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమ తమ విభాగాల్లో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు. వారిలో వీజే సన్నీ ఒకడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అతడు.. అద్భుతమైన ఆటతో సత్తా చాటాడు. కోపంతో పలుమార్లు గొడవలు పడినప్పటికీ.. ఆ తర్వాత తన ప్రేమను చూపించి కంటెస్టెంట్లతో పాటు ఆడియెన్స్ మనసులు కూడా గెలుచుకుని సీజన్ విజేతగా అవతరించాడు.

సన్నీ రెమ్యూనరేషన్ వివరాలివే

ఖమ్మ జిల్లాకు చెందిన వీజే సన్నీ.. జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించాడు. ఆ తర్వాత వీడియో జాకీగా మారాడు. అనంతరం సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక, కొన్ని సినిమాల్లోనూ నటించాడు. ఇలా ఈ సీజన్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక, పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా సన్నీకి షో నిర్వహకులు వారానికి రెండు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని తాజాగా తెలిసింది. అంటే అతడు హౌస్‌లో పదిహేను వారాల పాటు కొనసాగాడు. దీని ద్వారా మొత్తం ముప్పై లక్షల రూపాయలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడు.

ప్రైజ్‌మనీ కూడా గట్టిగా వచ్చింది

18 మంది కంటెస్టెంట్లను వెనక్కి నెట్టి బిగ్ బాస్ ఐదో సీజన్‌ విజేతగా నిలిచిన వీజే సన్నీకి షో నిర్వహకులు ప్రకటించిన రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీ వచ్చింది. దీన్ని గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో స్టార్ మా బిజినెస్ హెడ్ చేతుల మీదుగా అందించారు. దీనితో పాటు సువర్ణ భూమి వాళ్ల తరపు నుంచి రూ. 25 లక్షల విలువైన ఫ్లాట్ కూడా దక్కింది. అలాగే, దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన ఓ అపాచీ స్పోర్ట్స్ బైక్‌ను కూడా సన్నీ గెలుచుకున్నాడు. ఇవన్నీ కలిపితే అతడు రూ. 78 లక్షలు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అన్నీ కలుపుకుంటే కోటికి పైగానే

ఆద్యంతం చక్కగా ఆడుతూ బిగ్ బాస్ ఐదో సీజన్ విజేతగా నిలిచిన వీజే సన్నీ.. కొన్ని కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అదే సమయంలో ఈ రియాలిటీ షో ద్వారా చాలా మొత్తాన్నే తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఈ షోతో కోటీశ్వరుడు అయిపోయాడు. రెమ్యూనరేషన్ ద్వారా దాదాపు రూ. 30 లక్షలు సంపాదించిన అతడు.. ప్రైజ్‌మనీ ద్వారా రూ. 78 లక్షలను సొంతం చేసుకున్నాడు. ఇవన్నీ కలుపుకుంటే అతడు బిగ్ బాస్ షో ద్వారా రూ. 1.08 కోట్లు సంపాదించాడని తెలుస్తోంది. దీంతో సన్నీతో పాటు ఫ్యామిలీ ఫుల్ ఖుషీగా ఉందట.

ప్రైజ్‌మనీలో భారీ కోత అంటూ

వీజే సన్నీ బిగ్ బాస్ ఐదో సీజన్ గెలవడం ద్వారా రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీని సంపాదించాడని అందరికీ తెలుసు. అయితే, అతడికి మాత్రం రూ. 34.40 లక్షలు మాత్రమే చేతికి వచ్చిందని తెలిసింది. దీనికి కారణం ఏదైనా షోలో 10 వేల కంటే ఎక్కువ గెలిస్తే 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే అతడికి దక్కిన రూ. 50 లక్షల్లో.. రూ. 15.60 లక్షలు ఆదాయపు పన్ను శాఖకు వెళ్లిపోతుంది. దీంతో సన్నీ ప్రైజ్‌మనీలో రూ. 34.40 మాత్రమే అందుకుంటాడు. దీంతో అతడు కోటి రూపాయలకు పైగా గెలిచినా ట్యాక్సుల వల్ల చాలా కోల్పోయాడనే టాక్ వినిపిస్తోంది.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents