సన్నీ, షన్నూ కంటే అతడికే ఎక్కువ.. మధ్యలో వెళ్లినా కోటి పైనే.. ఎవరికి ఎంత?
రియాలిటీ ఆధారంగా నడిచే సంఘటనలతో ప్రసారం అవుతూ… చాలా కాలంగా ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. తెలుగు బుల్లితెరపై కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుని దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది.
ఈ క్రమంలోనే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇలా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా ముగించింది. ఇక, ఇప్పుడు ఐదో సీజన్‌ను కూడా అలాగే కంప్లీట్ చేసుకున్నారు.
దాదాపు 15 వారాల పాటు అలరించిన ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గత ఆదివారంతో ముగిసింది. ఇందులో వీజే సన్నీ విజేతగా నిలవగా.. షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‌గా మిగిలాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఐదో సీజన్ రెమ్యూనరేషన్ వివరాలు లీకయ్యాయి. ఆ సంగతులు మీకోసం!
ఐదో సీజన్ విజేతగా నిలిచిన సన్నీ
మొదటి నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని భారీ బజ్‌తో మూడు నెలల క్రితమే ప్రారంభం అయింది. ఈ సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు.
వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు పోటీ పడ్డారు. వీరిలో వీజే సన్నీ ఫినాలేలో విన్నర్‌గా నిలిచి సత్తా చాటాడు.
14వ వారం వెళ్లిన కాజల్‌కు ఎంత?
14 వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కాజల్‌కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా, షో వివరాలు తెలిసిన ప్లేయర్‌గా కొనసాగిన ఆమెకు బాగానే ముట్టజెప్పి ఉంటారని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్జే కాజల్ ఒక్క వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుందట. అంటే ఆమె 14 వారాలు వారాల పాటు హౌస్‌లో కొనసాగింది. కాబట్టి మొత్తం మీద ఆమెకు రూ. 30 లక్షలకు పైగానే రెమ్యూనరేషన్‌గా వచ్చినట్లు తెలుస్తోంది.
సిరికి వచ్చిన రెమ్యూనరేషన్ ఎంత
తాజాగా ముగిసిన ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో సిరి హన్మంత్ ఒకరు. బయట ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. అయితే, ఆటతీరులో పర్వాలేదనిపించినా.. వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలిస్తూ వచ్చిందామె.
దీనికి కారణం షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి రచ్చ చేయడమే. ఇక, ఆటతీరుతో మెప్పించి ఫినాలే వరకూ చేరిన ఆమె ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఆమెకు వారానికి రెండు లక్షలు చొప్పున పదిహేను వారాలకు గానూ బిగ్ బాస్ నిర్వహకులు రూ. 30 లక్షలు ముట్టజెప్పారని తెలుస్తోంది.
మిస్టర్ కూల్ మానస్ రెమ్యూనరేషన్
ఐదో సీజన్ మొత్తంలో కూల్‌గా ఉండడంతో పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న వారిలో మానస్ ఒకడు. ఆది నుంచీ మంచి వ్యక్తిత్వంతో పాటు నిజాయితీగా ఉంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దీంతో పలుమార్లు నామినేషన్‌ను కూడా తప్పించుకున్నాడు. ఇలా చివరి వరకూ కంటిన్యూ చేసి ఫినాలేకు కూడా చేరుకున్నాడు. కానీ, చివర్లో నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. ఇక, మానస్‌కు కూడా వారానికి రెండు లక్షలు చొప్పున పదిహేను వారాలకు గానూ బిగ్ బాస్ నిర్వహకులు రూ. 30 లక్షలు చెల్లించారనే టాక్ వినిపిస్తోంది.
3వ స్థానంలో ఉన్న శ్రీరామ్‌కు ఎంత
ఇండియన్ ఐడల్ టైటిల్ గెలవడం ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు సింగర్ శ్రీరామ చంద్ర. ఉత్తరాది వాళ్లకు చేరువ అయినా.. తెలుగు వాళ్లకు మాత్రం అంతగా పరిచయం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అతడు కూడా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. చివర్లో కాళ్లకు గాయాలు అయినా అద్భుతంగా ఆడి ఫినాలేకు చేరుకున్నాడు. కానీ, చివర్లో మూడో స్థానంలోనే నిలిచాడు. ఇక, శ్రీరామ చంద్ర వారానికి మూడు లక్షలు చొప్పున.. పదిహేను వారాలకు గానూ రూ. 45 లక్షలు అందుకున్నాడని సమాచారం.
రన్నర్ షన్నూ రెమ్యూనరేషన్ ఇలా
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒకడు. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన అతడు.. భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అందుకే ఆరంభం నుంచే ట్రెండింగ్ అవుతూ వచ్చాడు. అదే ఆటతీరుతో ఫినాలే వరకూ చేరుకున్నాడు. అయితే, సిరి హన్మంత్‌తో వ్యవహరించిన తీరుతో విమర్శలను ఎదుర్కోవడంతో పాటు రన్నరప్‌గానే మిగిలిపోయాడు. అయినప్పటికీ షణ్ముఖ్‌కు వారానికి ఐదు లక్షలు చొప్పున.. పదిహేను వారాలకు గానూ బిగ్ బాస్ నిర్వహకులు రూ. 75 లక్షలు చెల్లించారని అంటున్నారు.
విజేత సన్నీకి వచ్చింది ఎంతంటే?
ఆరంభం నుంచే చక్కగా ఆడుతూ బిగ్ బాస్ ఐదో సీజన్ విజేతగా నిలిచిన వీజే సన్నీ.. కొన్ని కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అదే సమయంలో ఈ రియాలిటీ షో ద్వారా చాలా మొత్తాన్నే తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఈ షోతో కోటీశ్వరుడు అయిపోయాడు. రెమ్యూనరేషన్ ద్వారా దాదాపు రూ. 30 లక్షలు సంపాదించిన అతడు.. ప్రైజ్‌మనీ ద్వారా రూ. 78 లక్షలను సొంతం చేసుకున్నాడు. ఇవన్నీ కలుపుకుంటే అతడు బిగ్ బాస్ షో ద్వారా రూ. 1.08 కోట్లు సంపాదించాడని తెలుస్తోంది. దీంతో సన్నీతో పాటు ఫ్యామిలీ యమ హ్యాపీగా ఉందట.
అందరి కంటే అతడికే ఎక్కువ అని
ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వారిలో యాంకర్ రవి ఒకడు. బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ కావడంతో.. అతడికే ఎక్కువ హైప్ లభించింది. దీంతో టైటిల్ గెలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ, అతడు 12వ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అయినప్పటికీ అందరి కంటే ఎక్కువగా రవి వారానికి పది లక్షలు చొప్పున.. పన్నెండు వారాలకు గానూ రూ. 1.20 లక్షలు చార్జ్ చేశాడని తెలిసింది.