దీప్తి నన్ను బ్లాక్ చేసింది.. బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్..

0 14

షణ్ముఖ్ జస్వంత్.. యూట్యూబ్‏లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాఫ్ట్‏వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‏తో షణ్ముఖ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

Bigg Boss 5 Telugu Shanmukh: దీప్తి నన్ను బ్లాక్ చేసింది.. బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన షణ్ముఖ్..

Also Read :

ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో షణ్ముఖ్ ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్ కూడా అదే రేంజ్‏లో సూపర్ హిట్ కావడంతో షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్‏గా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే క్రేజ్‏తో బిగ్‏బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టాడు. అయితే షన్నూ బిగ్‏బాస్ సీజన్ 5 విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బిగ్‏బాస్ టైటిల్ రేసులో ముందున్న షణ్ముఖ్ ఆ తర్వాత.. సిరితో స్నేహం.. శ్రుతి మించిన హగ్గులతో తనను మరింత దిగజార్చుకున్నాడు. అలాగే సిరి గురించి పొసెసివ్‏గా మాట్లాడడం.. ఆమెపై అరవడం కూడా షన్నూను పూర్తిగా నెగిటివ్ చేసిందనే చెప్పుకోవాలి. దీంతో బిగ్‏బాస్ టైటిల్ రేసులో రన్నరప్ గా మిగిలి టైటిల్ చేజార్చుకున్నాడు.

అయితే బిగ్‏బాస్ ఇంట్లోకి రాకముందే షణ్ముఖ్, దీప్తి సునయన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సిరి…కూడా శ్రీహాన్‍ను ఎంగేజ్మెంట్ చేసుకోని బిగ్‏బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లో వీరిద్దరి ఆడియన్స్ కు అంతగా రుచించలేదు. దీంతో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే బిగ్‏బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాకా మేమిద్దరం స్నేహితులమే అంటూ క్లారిటీ ఇచ్చింది సిరి. ఇక షన్నూ అయితే రూమర్స్ రావడం కొత్తేమి కాదంటూ ఇప్పుడు తెల్చీ చెప్పేశాడు. తాజాగా తన ఇన్ స్టా లైవ్ లోకి వచ్చిన షణ్ముఖ్.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఎక్కువగా దీప్తి సునయన గురించి అడగడంతో బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చాడు షన్నూ. ప్రస్తుతం తనను బ్లాక్ చేసిందని.. కోపం వచ్చినా.. అలిగిన ఇలాగే బ్లాక్ చేస్తుందని.. త్వరలోనే హైద్రాబాద్ వెళ్లి తనను కలుస్తానని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. దీప్తి నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్ చేసింది. అయినా నా కోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్ మాత్రం జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents