కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గంగుల
కరీంనగర్ లోని కలెక్టరెట్ ఆడిటోరియంలో 115 మంది లబ్ధిదారులకు బుదవారం రోజు 1. 86 కోట్ల రూ. కళ్యాణ లక్ష్మీ చెక్కులను నగర మేయర్ వై. సునిల్ రావు, పాలకవర్గ సభ్యులతో మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు.
ఈ సందర్భముగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ. ఆడ పడుచులకు అన్నాగా, మేన మామగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతి పేదింటి ఆడబిడ్డకు లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రమలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నా రు. ప్రపంచంలో ఈ పథకం ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదల సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ఆడబిడ్డల దీవేనెలు ఎల్లప్పుడు ఉండాలని కోరారు.