వాళ్ల ఫోన్ లు పగలకొట్టండి… అభిమానులపై మంగ్లీ సీరియస్..
వైరలవుతున్న వీడియో..
మరోవైపు మంగ్లీ సినిమా సాంగ్స్ మాత్రమే కాకుండా.. వినాయక చవితి, బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, శివరాత్రి సందర్భంగా ప్రత్యేక గీతాలు పాడటమే కాకుండా అందులో నటించి ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకుంది. ఈమె పాడే ప్రత్యేక భక్తి గీతాలకు యూట్యూబ్‌లో ఇప్పటికే లక్షలాది…కోట్లాది వ్యూస్ సంపాదించాయి. ఈమె పాడే పాటలకు ఎంతో మంది అభిమానులున్నారు.
అయితే, లేటెస్ట్ గా మంగ్లీకి ఫ్యాన్స్ సెగ తగిలింది. సింగర్ మంగ్లీ అభిమానుల విషయంలోనే తీవ్ర అసహనానికి గురయ్యారు. వివరాల్లోకెళితే.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ తగిలింది. మంత్రి కుమార్తె పెళ్లి రిసెప్షన్‌కు వచ్చిన మంగ్లీతో సెల్పీలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు. ఒక్కసారిగా ఫోటోల కోసం ఫ్యాన్స్ హంగామా చేయడంతో తట్టుకోలేక అటూ ఇటూ పరుగులు పెట్టింది మంగ్లీ.