పెళ్లి పీటలపై నుంచి నేరుగా పానీపూరి తినేందుకు వెళ్లిన పెళ్లి కూతురు (వీడియో వైరల్)
పానీపూరీ అంటే ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు అందరూ పానీపూరీని ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మయిలు/యువతులు పానీపూరీ అంటే అమితంగా ఇష్టపడతారు. ఇదిగో ఈ పెళ్లి కూతురిలా. మహిమా అగర్వాల్ అనే ఈ యువతీకి ఇటీవల శ్రేష్ట్ అనే యువకుడితో పెళ్లి జరిగింది. పెళ్లి తంతు మొత్తం పూర్తైన అనంతరం అక్కడే ఉన్న తన స్నేహితులను, బంధువులను పలకరిస్తున్న మహిమకు ఎదురుగా పానీపూరీ కనిపించింది. అది చూసి ఆగలేక.. పరుగెత్తుకెళ్లిన మహిమ.. ఆత్రంగా పానీపూరీ కావాలంటూ ప్లేట్ తీసుకుంది.
వడ్డిస్తున్నవ్యక్తి ముందుగా ఒక పూరీని మహిమకు అందించగా.. “గోధుమ పిండితో చేసిన ఆ పూరీ నాకు వద్దంటూ” పక్కనే ఉన్న కొత్త పెళ్లికొడుక్కి అందించింది. పెళ్లి కూతురు చేసిన పనికి అక్కడున్నవారు ఫక్కున నవ్వుకోగా.. పెళ్లి కొడుకు ఆ పూరీని అందుకుని తిన్నాడు. అనంతరం మహిమ కోసం ప్రత్యేకంగా కరకరలాడే పానీపూరీని వడ్డించారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీయగా..మహిమ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. “నా పానీపూరీ వీక్ నెస్ గురించి.. శ్రేష్ట్(మహిమ భర్త)కు ముందే ఎవరైనా హెచ్చరించాల్సింది” అంటూ సరదాగా ట్యాగ్ చేసింది. ఉత్తర భారతంలో పెళ్లిళ్లలో వడ్డించే వంటకాల్లో పానీపూరీ అందించడం సర్వసాధారణం. ప్రస్తుతం ఈ వీడియో 10 లక్షల వ్యూస్, 50 వేలకు పైగా లైక్ లతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పెళ్లి పీటలపై నుంచి నేరుగా పానీపూరి తినేందుకు వెళ్లిన పెళ్లి కూతురు pic.twitter.com/UwuKgB4FB4
— Karimnagar Today (@karimnagarlocal) January 1, 2022