కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ వెనుక టైర్ల క్రింద పడటంతో…
కరీంనగర్ లో డ్రైవర్ పని ముగించుకుని శనివారం సాయంత్రం ఇంటికి వెళ్లే క్రమంలో, కమాన్ పూర్ పెట్రోల్ బంకు మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ వెనక టైర్ల కింద పడడంతో, అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు కరీంనగర్ లోని కొత్తపల్లి మండలం ఓడ్డ పల్లి గ్రామానికి చెందిన రాజు(30)గా గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు వున్నారు. రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి రోడ్డు సరిగా లేకపోవడంతో బండి స్కిడ్ అయ్యి ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు. ప్రమాదం జరిగిన చోటికి పోలీసులు చేరుకున్నారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.