రోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి
పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామ శివారులో శ్రీ యోగానంద లక్ష్మినర్సింహస్వామి ఆలయం నుంచి ఎస్సీ కాలనీలోని ప్రైమరీ స్కూల్ వరకు మెటల్ లేదా సీసీ రోడ్డు నిర్మించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి ఆదివారం గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. సుమారు రెండు కి.మీ మట్టి రోడ్డు ఉందని, వర్షాకాలంలో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదని వివరించారు. ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షుడు కల్లెపల్లి లింగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తొగరు శ్రీనివాస్, రైతు సమితి అధ్యక్షుడు గడ్డమీది శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంకెండ్ల లక్ష్మినర్సయ్య, తెరాస నాయకులు కొండపల్లి కృష్ణమూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు.