బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం: ఈటల రాజేందర్
ఉద్యోగుల బదిలీల విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేయాలని పోలీసులు వ్యవహరించిన తీరును హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆఫీసులో కూర్చుని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం అప్రజాస్వామికమన్నారు. బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ జాగరణ చేస్తున్నారని, వారిపై విచక్షణా రహితంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం అమానుషమన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, ఉద్యోగుల కోసం చేస్తున్న ఆందోళనను అడ్డుకుంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.