కాకతీయ కెనాల్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
ఈత సరదా ప్రాణాలమీదకు తెచ్చింది. కాకతీయ కెనాల్‌లో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన వరంగల్ లోని డాక్టర్స్ కాలనిలో చోటు చేసుకుంది.
ఆదివారం సెలవుదినం కావడంతో నలుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. కాలువలో నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో ఇద్దరు విద్యార్థులు కొట్టుకుపోగా మరో ఇద్దరు విద్యార్థులు వడ్డుకు వచ్చారు. అనంతరం గల్లంతైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి విషయం తెలిపారు. వారి కుటుంబ సభ్యులు కాలువ దగ్గరకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థులకోసం గాలింపు చేపట్టారు. గల్లంతైన విద్యార్థులు వరంగల్ నగరంలోని కొత్తవాడకు చెందిన వారుగా తెలుస్తోంది.