చెంజర్ల కేసులో మరో ట్విస్ట్.. పక్కాగా ప్లాన్‌తో పేరెంట్స్
కరీంనగర్ జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన వరలక్ష్మి హత్య ఘటనలో మరో కీలక విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. వరలక్ష్మిని హత్య చేయాలని ప్రియుడు అఖిల్‌ను అతని తల్లి లక్ష్మి, తండ్రి శ్రీనివాస్‌లే ప్రేరేపించారని విచారణలో తేలినట్లుగా పోలీసులు వెల్లడించారు. కాగా ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కి తరలించినట్టు తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, ఎసై ప్రమోద్ రెడ్డి తెలిపారు.