Print Friendly, PDF & Email

త‌గ్గేదేలే అంటున్న ర‌ష్మిక! హిట్‌తో హాట్ పెంచేసిన బ్యూటీ..

0 143,622

 1. రష్మిక మందన్న తన తాజా చిత్రం పుష్ప: ది రైజ్ అటు థియేట‌ర్లో ఇటు ఓటీటీలో సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకొంది. (Rashmika Instagram)

 2. హిందీలోనూ ఈ చిత్రం దుమ్మురేపే క‌లెక్ష‌న్‌లు వ‌సూలు చేసింది. బాలీవుడ్ అంతా పుష్ప క‌లెక్ష‌న్‌ల వైపు చూసింది. క‌రోనా కార‌ణంగా సినిమాలు పెద్ద‌గా ఆడ‌ని స‌మ‌యంలో పుష్ప మంచి విజ‌యాన్ని అందుకొంది. (Photo- Instagram)

 3. పుష్ప రెండవ భాగం ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లి 2022 చివరి నాటికి థియేటర్లలోకి రానుందని చిత్ర దర్శకుడు సుకుమార్ గతంలో ప్రకటించారు. (Photo -Instagram)

 4. రష్మికకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఆదరణ ఉంది కానీ పుష్ప: ది రైజ్ విడుదలైన తర్వాత, ఆమె ప్రజాదరణ మరియు అభిమానుల ఫాలోయింగ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. (Photo : Twitter)

 5. ర‌ష్మిక ప్ర‌స్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను మరియు వికాస్ బహ్ల్ దర్శకత్వంలో గుడ్‌బై చిత్రాలను కలిగి ఉంది మరియు ఈ బాలీవుడ్ చిత్రాలలో బిజీగా ఉంది.,[object Object],(Rashmika Mandannna Photo : Twitter)

 6. పుష్ప: ది రైజ్ చిత్రానికి సంబందించి రెండవ భాగం, పుష్ప: ది రూల్ కోసం ర‌ష్మిక మంద‌న్న త‌న రెమ్యునరేషన్‌ను పెంచిందని స‌మాచారం. (Rashmika Instagram)

 7. మొదటి భాగంలో న‌టించ‌డానికి ఆమెకు రూ. 2 కోట్లు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే సినిమా హిట్‌తో త‌ను పారితోష‌కం పెంచింది. (Photo - Instagram)

 8. పుష్ప రెండో పార్ట్ పుష్ప -ది రూల్ కోసం ర‌ష్మిక మంద‌న్న‌ రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. (Photo - Instagram)

 9. ఈ వార్త‌లే నిజ‌మైతే ర‌ష్మిక‌ కెరీర్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొన్న సినిమాగా పుష్ప‌-ది రూల్ అవుతుంద‌ని సినిమా వ‌ర్గాలు చెబుతున్నాయి. (Photo - Instagram)

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents