Print Friendly, PDF & Email

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై నిషేధాజ్ఞలు కొనసాగింపు

0 49

సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈనెల 20 వరకు పొడిగించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

మద్యం సేవించి మద్యం ప్రియులు వీధుల్లో, రోడ్లపై అసభ్య పదజాలంతో మాట్లాడుతుండటం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించింది. మద్యం ప్రియుల ఆగడాలకు కళ్లెం వేయడంతో పాటు ప్రజల రక్షణ, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలపరిమితి పొడిగించబడే అవకాశం ఉంది ఐపీసీ 188, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు .

డీజే లపై నిషేధాజ్ఞలు పొడగింపు

కరీంనగర్ కమీషన్ రేట్ పరిధిలో డీజే సౌండ్ ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈనెల 20 వరకు పొడగించడం జరిగిందని పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ ల వినియోగంపై నిషేధాజ్ఞలు విధించడం జరిగిందని పేర్కొన్నారు.

వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డిజె సౌండ్ లను వినియోగిస్తున్న విషయం విధితమే. వివిధ కార్యక్రమాలు నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసీపీ ల అనుమతి పొందాలని సూచించారు. ఏ ఏ ప్రాంతాల్లో ఏ మేరకు ఏ స్థాయిలో మైక్ సెట్ లు వినియోగించాలో పరిమితులు ఉన్నాయని పేర్కొన్నారు. కమీషనరేట్ పరిధిలో ఇప్పటివరకు డీజే ల వినియోగం పై యజమానులకు అవగాహన కల్పించడం జరిగింది. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలపరిమితిని పొడిగించబడే అవకాశం ఉంది. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై ipc 188, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధన లను అనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents