రైతుబంధు ప్రపంచానికే ఆదర్శం: వినోద్
రైతుబంధు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అనుకరిస్తున్నాయని ఇది సీఎం కేసీఆర్ కు దక్కిన అరుదైన గౌరవం అని కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడమే రైతుబంధు పథకం లక్ష్యమని, రైతుకు పెట్టుబడే రైతుబంధు అని, ఈ వినూత్న పథకం ప్రపంచానికే ఆదర్శమని ఆయన తెలిపారు.