ఎమ్మెల్సీ రమణకు ఆపరేషన్
కరీంనగర్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణకు గుండె శస్తచ్రికిత్స జరిగింది. రెండు రోజుల కిందట ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో సాధారణ పరీక్షలు చేయించుకోగా గుండెలు ఒక వాల్వ్ దెబ్బతిందని వైద్యులు నిర్ధారించారు. వైద్యుల సూచన మేరకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రమణ కోలుకుంటూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.