పోలీస్ స్టేషన్‌లో కరోనా పరీక్షలు
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లోని సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసిపి సారంగ పాణి మాట్లాడుతూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.