కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కళ్యాణలక్మి పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణలోని నిరుపేద ఆడబిడ్డలకు పెద్దన్నగా నిలిచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ కొనియాడారు. తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల, మల్లాపూర్, పోలంపల్లి, నర్సింగాపూర్, మోగిలిపాలెం, పర్లపల్లి గ్రామాలలో మంగళవారం రసమయి విస్తృతంగా పర్యటించారు.
లబ్ధిదారుల ఇళ్లకు ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి చెక్కులు అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లోని 13 మంది లబ్ధిదారులకు గాను రూ. 13 లక్షల 15 వేళ కళ్యాణలక్మి చెక్కులను పంపిణీ చేసి, గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే రసమయి కి ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆప్యాయ పలకరింపులు, ఆత్మీయ స్వాగతాలు పలికారు.