బండి సంజయ్ ని కలిసిన కార్పొరేటర్లు
317 ఉద్యోగ ఉపాధ్యాయ జీవోను సవరించాలని కోరుతూ కరీంనగర్లో భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ దీక్ష పోలీసులు భగ్నం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారని.. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. త్రిబుల్ త్రి సెక్షన్ల కింద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తో పాటు తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జైలు నుంచి విడుదలైన భాజపా కార్పొరేటర్లు, నాయకులు హైదరాబాదులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను మంగళవారం కలిశారు.