తప్పు ఒప్పుకున్న హీరో సిద్దార్థ్..
ఆమె గొప్ప క్రీడాకారిణి అంటూ ట్వీట్?
తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ సమయంలో ఆయన పై దాడి చేయడంతో.. దేశ ప్రధానికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఆ ఘటన పై స్పందిస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా వివాదాస్పదంగా కూడా మారిన సంగతి తెలిసిందే. సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్.అంటూ సైనా పై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై ఎంతో మంది ప్రముఖులు స్పందిస్తూ తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే విషయంపై హీరో సిద్ధార్థ్ పై కేంద్ర మంత్రి, చిన్మయి, అలాగే సైనా తండ్రి, సైనా నెహ్వాల్ భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సహా పలురువు సోషల్ మీడియా వేదికగా సిద్ధార్ద్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇంకొందరు అయితే సిద్ధార్థ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసన వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ తాను చేసిన ట్వీట్ ద్వారా ఎవరిని అగౌరవపరిచ లేదు అంటూ వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ విషయంలో అప్పటికే జరగాల్సిన తతంగమంతా జరిగిపోయింది. ఈ విషయంలో తాజాగా సిద్ధార్థ్ మరొకసారి ట్విట్టర్ వేదికగా అతను పెట్టిన కామెంట్స్ పై స్పందించారు.
బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కి హీరో సిద్ధార్థ్ క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు. సైనా నెహ్వాల్ పెట్టిన ట్వీట్ పై తాను చేసిన పోస్టు ఒక జోకు మాత్రమే అంటూ వివరణ ఇచ్చాడు. కానీ తాను చేసిన కామెంట్ చాలా మందిని బాధించింది అని తెలిపాడు. అయితే తనకు మహిళలను ఉద్దేశించి కించపరుస్తూ కామెంట్స్ చేయాలనే ఉద్దేశం తనకు లేదు అంటూ వివరణ ఇచ్చాడు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఒక గొప్ప క్రీడాకారిణి అని.. తాను ఎప్పుడూ ఆమెను గౌరవిస్తానని సిద్ధార్థ్ తెలిపారు. అంతేకాకుండా తాను పెట్టిన పోస్ట్ చాలా మందిని బాధ పెట్టిందని.. కాబట్టి తాను అలాంటి కామెంట్స్ చేసినందుకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ తెలిపాడు సిద్దార్థ్.