మాసపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి
కరీంనగర్ మున్నూరుకాపు మాసపత్రిక 9వ వార్షికోత్సవం సందర్భంగా, ప్రచురించిన మున్నూరుకాపు మాసపత్రిక క్యాలెండర్ ను బుధవారం కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తొమ్మిది సంవత్సరాలు మాసపత్రికను కొనసాగించడం అభినందనీయమన్నారు. మాసపత్రిక సిబ్బందికి రిపోర్టర్లకు, మున్నూరుకాపులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాసపత్రిక ప్రతినిధి రాచమల్ల సాయి క్రిష్ణ, రాచమల్ల సుగుణాకర్, బొంతల శ్రీనివాస్, బొంతల సంపత్, ఉప్పు శ్రీనివాస్, కార్పొరేట్ జంగిలి సాగర్, కొట్టె శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.