నగరపాలక అధికారులపై చర్యలు తీసుకోండి: కార్పొరేటర్లు
సమాచారం హక్కు చట్టంకు లోబడి రామగుండం నగర పాలక సంస్థలో పలు విభాగాలలో జరుగుతున్న నిధుల దుర్వినియోగం, సానిటేషన్ విభాగంలో అవుట్ సోర్సింగ్ నియమకాలపై సమాచారం అడిగితే 70 రోజులు గడుస్తున్నా అధికారులు ఏదో ఒక సాకు చెప్పి కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ 16వ డివిజన్ కార్పొరేటర్ మండల కిషన్ రెడ్డి, 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు పెద్దపెల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ కి గురువారం ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా పాలన గాడిలో పడేలా కృషి చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.