వేములవాడ పట్టణంలోని లాడ్జిల తనిఖీ చేసిన పోలీసులు
వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేట్ లాడ్జిలను బుధవారం రాత్రి వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని పలు లాడ్జిలను తనిఖీ చేసినట్టు, లాడ్జిల యజమానులు, నిర్వాహకులకు కొన్ని సూచనలు చేశారు.
1. లాడ్జిల యందు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
2. గదులు అద్దెకు తీసుకునే ప్రతీ ఒక్కరి వివరాలకు సంబందించిన ఐడి కార్డు/ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాలి.
3. ప్రతీ ఒక్కరి ఫోన్ నెంబర్ తీసుకొని ఒక్కసారి అట్టి ఫోన్ నెంబర్ వారిదో కాదో సరిచేసుకోవాలి.
4. వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలి.
5. ఎవరి మీద అయినా అనుమానం ఉంటే పోలీస్ వారికి సమాచారం అందించాలి.
6. గదులు ఎక్కువ మందికి ఇవ్వకూడదు.
7. విధిగా సోషల్ డిస్టెన్స్ పాటింంచాలి.
8. గదులకి వచ్చే ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించేలా చూడాలి.
9. గదులు అద్దెకు ఇచ్చే ముందు మరియు వెళ్ళిపోయిన తర్వాత గదులను శానిటేషన్ చేయించాలని తెలిపారు. రాబోవు మహాశివరాత్రిని దృష్టిలో పెట్టుకొని ఇకనుండి వరుసగా లాడ్జిల తనిఖీలు ఉంటాయని, భక్తులతో లాడ్జి నిర్వాహకులు మర్యాద పూర్వకంగా ఉండాలని, లాడ్జిలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన లాడ్జిల యాజమాన్యం, నిర్వాహకుల మీద కూడా కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు.