రాజన్న ఆలయంలో భక్తుల సందడి
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునేందుకు తరలిరావడంతో ఆలయం భక్తులతో సందడిగా మారింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చక స్వాములు. స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. కరోనా నియమ నిబంధనలు పాటించే భక్తులను మాత్రమే ఆలయ అధికారులు స్వామివారి దర్శనార్థం అనుమతిస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్లి అమ్మవారిని దర్శించుకునే ముందు రాజన్న దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.