బీభత్సం సృష్టించిన గాలి వాన
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా గాలివాన ప్రారంభమై రాళ్ల వానతో బీభత్సం చేసింది. చెట్టు కొమ్మలు విరిగి, రేకులు, షాపు బోర్డులు గాలికి ఎగిరిపోయాయి. రోడ్లపై వరద నీరు పారింది. సుమారు గంట సేపు ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కోన్నారు.