ఘోర రోడ్డు ప్రమాదం….ప్రభుత్వ ఉద్యోగి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సరిహద్దులో రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి భూక్య రాములు (32) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గంభీరావుపేట మండలం రాజుపేట ప్రాథమిక స్కూల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో తన స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో నివాసముంటూ వ్యక్తిగత పనుల పై గంభీరావుపేట మండల కేంద్రంకు వస్తుండగా సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (Ap29z1975) కను గల బస్సు టీఎస్ 16ek1311అను నెంబరు గల స్కూటీని ఢీకొట్టడంతో ఈ ఘటన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టకు తరలించారు. మృతునికి భార్య కళ, కూతురులు రేవతి, మున్ని, కుమారుడు విశ్వష్ లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.