పోలీసు గెస్ట్ హౌస్ పనులను పరిశీలించిన చైర్మన్ దామోదర్
గోదావరిఖని పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ గెస్ట్ హౌస్, గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, పోలీస్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్, అధికారులతో కలిసి సందర్శించి బిల్డింగ్స్ నిర్మాణం జరిగిన తీరును శుక్రవారం పరిశీలించారు. పోలీస్ అధికారులతో హౌసింగ్ బోర్డు అధికారులతో పెండింగ్ ఉన్న పనుల గురించి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా దామోదర్ గుప్త మాట్లాడుతూ.. పోలీస్ ఆఫీసర్స్ గెస్ట్ హౌస్, పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ అత్యాధునిక టెక్నాలజీ అన్ని వసతులు కల్పించి నిర్మించడం జరుగుతుందన్నారు. చిన్న చిన్న పనులన్నీ త్వరిత గతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దాలని కాంట్రాక్టర్, పోలీస్ హౌసింగ్ బోర్డు అధికారులకు చైర్మన్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ లు రమేష్ బాబు, రాజ్ కుమార్, శ్రీనివాస్ ఇఇ, విశ్వనాథం, డిఇఇ సాయి చంద్, ఏఇ, వినయ్, ఏఇలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.