బిజెపి రైతు వ్యతిరేక విధానాలను భోగి మంటల్లో కాల్చెద్ధాం: మంత్రి కొప్పుల
బిజెపి రైతు వ్యతిరేక విధానాలను భోగి మంటల్లో కాల్చెద్దాం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పంట పెట్టుబడి రైతు బంధుతో తెలంగాణలోని ప్రతి ఇంట్లో సంక్రాంతి పండుగ ఘనంగా జరగాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని ఆచరణలో చూపుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజయవంతంగా అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, నీటి తీరువా రద్దు, రైతు బంధు, బీమా, రుణ మాఫీ వంటి పథకాల అమలుతో తెలంగాణకు నిజమైన సంక్రాంతి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు.