వాట్సప్ స్టేటస్ లో ప్రియురాలి నగ్న వీడియో!
ప్రేమ పేరుతో నమ్మించిన ఓ యువకుడు ప్రియురాలి నగ్న వీడియోలను వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ బాలిక అదే గ్రామానికి చెందిన డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇటీవల వాట్సాప్ లో వీడియోకాల్ చేసి నగ్నంగా కనిపించాలని కోరాడు. ప్రియుడి కోరిక మేరకు బాలిక అతడు చెప్పినట్లుగా చేసింది. ఇటీవల బాలికతో ఘర్షణ పడ్డాడు. తాను చెప్పినప్పుడు తన వద్దకు రావాలని కోరాడు. పొలంలో పని ఉంది రాలేనని బాలిక చెప్పడంతో ఈ నెల 10న 19 సెకన్ల నిడివి గల బాలిక నగ్న వీడియోను తన వాట్సప్ స్టేట్‌స్ గా పెట్టాడు. ఈ విషయం గ్రహించిన వారు బాలికకు చెప్పడంతో ఆమె యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయితే యువకుడు కుటుంబం ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో తమకు న్యాయం చేయాలని హుజూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. మహేశ్‌పై పోలీసులు అట్రాసిటీ, అత్యాచారం, ఐటీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేశారు.