Latest
>>ఆత్మీయ సమ్మేళనం నికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల>>కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక>>అన్నోన్ ప్రాపర్టీ కింద పరిగణించబడిన 196 స్క్రాప్ వాహనాలు వేలం వేయబడును : ఇంచార్జ్ సీపీ రామగుండం>>ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో నా కుటుంబంకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి ఆవేదన>>అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత>>పాతగూడూరులో కొనసాగుతున్న కంటివెలుగు>>ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్>>జగిత్యాలలో ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరాం సందడి>>రవీందర్ సింగ్ కు అభినందనలు తెలిపిన న్యాయవాదులు>>పదవి బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

Print Friendly, PDF & Email

కన్న కూతురిపైనే దారుణం..తండ్రి చేసిన ఘోరం

0 24

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తన సోదరుడికి ఈ విషయం చెప్పడంతో తండ్రి వికృత బుద్ధి వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి. బంజారా హిల్స్ ప్రాంతంలో నివసించే ఆటోడ్రైవర్‌ భార్య ఇటీవల జబ్బు పడింది. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె సోదరుడు ఆమెను పరామర్శించడానికి ఇంటికొచ్చాడు. అప్పుడు తనతో పాటు తన పిల్లలను అతని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.

కన్న కూతురిపైనే దారుణం..తండ్రి చేసిన ఘోరం

కానీ భర్త మాత్రం పిల్లలను తన వద్దే ఉంచుకుంటానన్నాడు. నిందితుడి వికృత బుద్ధిని ఏ మాత్రం ఊహించని ఆ తల్లి తన 15 ఏళ్ల కుమార్తె, ఇద్దరు కుమారులను అతని దగ్గరే విడిచిపెట్టి వెళ్లింది. కాగా ఈనెల 9న ఎప్పటిలాగే ఇంటికొచ్చిన తండ్రి అర్ధరాత్రి కూతురుపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమె నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడాడ్డు. బాధితురాలు జరిగిన విషయాన్ని మరుసటి రోజు తన సోదరుడికి చెప్పింది. ఆతర్వాత ఇద్దరూ కలిసి మహబూబ్ నగర్‌ లో ఉన్న తల్లి వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ విషయం విని విస్తుపోయిన తల్లి శుక్రవారం హైదరాబాద్‌ నగరానికి చేరుకుంది. భర్తపై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితునిపై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అతనిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents