శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సందడి (వీడియో)
దక్షిణకాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో నేడు కనుమ పర్వదినం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది. కరోనా నియమ నిబంధనలు పాటించే భక్తులను మాత్రమే ఆలయ అధికారులు స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు.