ఈ నెల 30 వరకు స్కూళ్లకు సెలవులు
రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువడింది. కరోనా కేసుల దృష్ట్యా సెలవులను పొడిగిస్తున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ప్రకటించారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది. దీంతో జనవరి 30 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
లోకల్ యాప్ సంక్రాంతి సందర్బంగా రిఫరల్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొని రూ.3 వేల వరకు బహుమతులు మీరు గెలుచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం యాప్ ఓపెన్ చేయగానే పైన రూ.అనే సింబల్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే పూర్తి వివరాలు మీకే తెలుస్తాయి.